సర్వాయి పాపన్న చరిత్రను తెలుసుకోవాలి

ABN , First Publish Date - 2023-04-25T23:04:45+05:30 IST

గౌడకులస్థులు సర్దార్‌ సర్వాయి పాపన్న చరిత్రను తెలుసుకోవాలని గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు రామారావు అన్నారు.

సర్వాయి పాపన్న చరిత్రను తెలుసుకోవాలి
సర్ధార్‌ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న గౌడ సంఘం రాష్ట్ర నాయకులు

మర్పల్లి, ఏప్రిల్‌ 25: గౌడకులస్థులు సర్దార్‌ సర్వాయి పాపన్న చరిత్రను తెలుసుకోవాలని గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు రామారావు అన్నారు. మండలంలోని కొంశెట్లిపల్లిలో మంగళవారం మండల అధ్యక్షుడు నయాబ్‌గౌడ్‌ అధ్యక్షతన సర్ధార్‌ సర్వాయిపాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు. ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మహానీయుడికి ప్రభుత్వ గుర్తింపు లేదన్నారు. గౌడ కులస్థులందరూ ఏకమై ప్రభుత్వాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మయ్య, జిల్లా అధ్యక్షుడు రామలింగయ్య, నాగేందర్‌గౌడ్‌, మండల అధ్యక్షుడు నయాబ్‌గౌడ్‌, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్‌, మురళీధర్‌, శంకరయ్యగౌడ్‌, రాజుగౌడ్‌, ప్రవీణ్‌గౌడ్‌, నవీన్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-25T23:04:45+05:30 IST