ఇళ్ల స్థలాలకు సర్పంచ్‌ భర్త డబ్బులు అడిగారు

ABN , First Publish Date - 2023-06-11T23:19:25+05:30 IST

రుక్మాపూర్‌లో ఇళ్ల స్థలాల కోసం సర్పంచ్‌ భర్త మల్లేశం డబ్బులు డిమాండ్‌ చేశారని ఉపసర్పంచ్‌ అనిత ఆరోపించారు.

ఇళ్ల స్థలాలకు సర్పంచ్‌ భర్త డబ్బులు అడిగారు
సమావేశంలో మాట్లాడుతున్న ఉపసర్పంచ్‌ అనిత

పెద్దేముల్‌, జూన్‌ 11: రుక్మాపూర్‌లో ఇళ్ల స్థలాల కోసం సర్పంచ్‌ భర్త మల్లేశం డబ్బులు డిమాండ్‌ చేశారని ఉపసర్పంచ్‌ అనిత ఆరోపించారు. ఆదివారం రుక్మాపూర్‌ గ్రామంలో లబ్ధిదారులతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. అందరూ పేదలు కావడంతో డబ్బులు ఇవ్వలేక ఎంపీపీ ద్వారా ఇళ్లస్థలాలు పొందారని చెప్పారు. రుక్మాపూర్‌లో ఇళ్లస్థలాల కోసం ఎవరూ ఎవరికి డబ్బులు ఇవ్వలేదని ఆమె తెలిపారు. సర్పంచ్‌ శివలీల అధికారులపై, తమ నాయకులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సర్పంచ్‌ను కాదని ఎంపీపీ ద్వారా స్థలాలు పొందినందుకు అందరిపైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. నాయకులకు కానీ అధికారులకు కానీ డబ్బులు ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు.

Updated Date - 2023-06-11T23:19:25+05:30 IST