శామీర్‌పేట సీఐ, ఎస్‌ఐలపైౖ వేటు

ABN , First Publish Date - 2023-05-31T23:11:54+05:30 IST

రిసార్ట్‌ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించేందుకు శామీర్‌పేట సీఐ సుధీర్‌తో పాటు ఎస్‌ఐ రవికుమార్‌లపై ఉన్నతాధికారులు వేటు వేశారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ రిసార్ట్‌ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే సీఐ, ఎస్సైలపై సీపీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

శామీర్‌పేట సీఐ, ఎస్‌ఐలపైౖ వేటు

కమిషనరేట్‌కు అటాచ్‌ చేస్తూ సీపీ ఉత్తర్వులు

మేడ్చల్‌ మే 31(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రిసార్ట్‌ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించేందుకు శామీర్‌పేట సీఐ సుధీర్‌తో పాటు ఎస్‌ఐ రవికుమార్‌లపై ఉన్నతాధికారులు వేటు వేశారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ రిసార్ట్‌ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే సీఐ, ఎస్సైలపై సీపీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. సీఐ సుధీర్‌కు సహకరించిన ఎస్‌ఐ రవికుమార్‌ను కూడా సీపీ కార్యాలయాలనికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు శామీర్‌పేట సీఐగా పనిచేసిన సుధీర్‌పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. ఎట్టకేలకు సీఐని సీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేశారు. ఇన్‌చార్జ్‌ సీఐగా రాజగోపాల్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - 2023-05-31T23:11:54+05:30 IST