డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ అద్దె బస్సు
ABN , First Publish Date - 2023-09-21T23:48:42+05:30 IST
ఆగి ఉన్న డీసీఎంను ఆర్టీసీకి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
పదిమందికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
ఇబ్రహీంపట్నం సమీపంలో ఘటన
ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 21 : ఆగి ఉన్న డీసీఎంను ఆర్టీసీకి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు(టీఎస్ 07 యూజీ 7172) గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇబ్రహీంపట్నం నుంచి ప్రయాణికులతో నగరంలోని ఎంజీబీ్‌సకు బయలుదేరింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై రిపేరు కారణంగా రోడ్డు పక్కన నిలిపి ఉన్న డీసీఎంను బస్సు వెనక నుంచి వేగంతో ఢీకొట్టింది. దీంతో కండక్టర్ బుగ్గ రాములుతో పాటు ప్రయాణికులు సుమలత, లక్ష్మమ్మ, మంగమ్మ, మల్లమ్మ, జంగయ్య, జగదీశ్వర్ సహా పదిమందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని డ్రైవర్‌తో పాటు మిగతా ప్రయాణికులు ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించారు. కండక్టర్ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు.