వికారాబాద్ నియోజకవర్గానికి రూ.28.7కోట్లు మంజూరు
ABN , First Publish Date - 2023-02-02T22:37:22+05:30 IST
వికారాబాద్ నియోజకవర్గానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద రూ.28.7కోట్లు మంజూరయ్యాయి.
వికారాబాద్, ఫిబ్రవరి 2: వికారాబాద్ నియోజకవర్గానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద రూ.28.7కోట్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించి జీఓను పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. అన్ని మండలాల్లోని గ్రామాల్లో అవసరమైనసీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించిన విధంగా ప్రభుత్వం నిధులు మంజూరుచే సింది. ఒక్కో గ్రామానికి రూ.5లక్షల నుంచి రూ.40లక్షల వరకు అవసరాన్ని బట్టి మంజూరు చేశారు. 172గ్రామాలకు నిధులు మంజూరయ్యాయి.