కానిస్టేబుల్‌, హోంగార్డులకు రివార్డు

ABN , First Publish Date - 2023-05-26T23:50:23+05:30 IST

యాచారంలో ఈ నెల 24న పి.ప్రేమలత అనే మహిళ కళ్లలో కారంచల్లి రెండు తులాల మంగళసూత్రాన్ని తెంపుకెళ్లిన నిందితుడిని పట్టుకున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ కృష్ణ, హోంగార్డు సతీ్‌షలకు రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ రివార్డు అందజేశారు.

కానిస్టేబుల్‌, హోంగార్డులకు రివార్డు
సీపీ డీఎస్‌ చౌహాన్‌తో సీఐ లింగయ్య, పక్కన కానిస్టేబుల్‌ కృష్ణ, హోంగార్డు సతీష్‌

యాచారం, మే 26: యాచారంలో ఈ నెల 24న పి.ప్రేమలత అనే మహిళ కళ్లలో కారంచల్లి రెండు తులాల మంగళసూత్రాన్ని తెంపుకెళ్లిన నిందితుడిని పట్టుకున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ కృష్ణ, హోంగార్డు సతీ్‌షలకు రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ రివార్డు అందజేశారు. శుక్రవారం నగరంలోని ఆయన కార్యాలయంలో వారికి రివార్డు కింద చెరో వెయ్యి రూపాయల చెక్కులిచ్చారు. సీపీ మాట్లాడుతూ.. చోరీ ఘటన జరిగిన గంట వ్యవధిలోనే నిందితుడు చైతన్యను పట్టుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సీఐ లింగయ్య, కమిషనరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T23:50:23+05:30 IST