సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:49 PM
సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నందున ఇంజినీరింగ్ విభాగంలో విద్యనభ్యసించే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని వ్యాల్యూ లాడెన్ సంస్థ సీఈవో లావణ్య అన్నారు.
మేడ్చల్ టౌన్, డిసెంబరు 18: సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నందున ఇంజినీరింగ్ విభాగంలో విద్యనభ్యసించే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని వ్యాల్యూ లాడెన్ సంస్థ సీఈవో లావణ్య అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మ గూడ నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం విద్యార్థుల కోసం ‘సొసైటల్ అప్లికేషన్ ఆఫ్ ఏఐ అండ్ ఎంఎల్ ఇన్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్’ అనే అంశంపై వారం రోజుల పాటు నిర్వహిస్తున్న సెమినార్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లావణ్య మాట్లాడుతూ.. సాంకేతిక రంగం వృద్ధిలో సివిల్, మెకానికల్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ అండ్ మిషిన్ లర్నింగ్ ప్రాధాన్యత ఎంతగానో పెరిగిందన్నారు. ప్రతీ విషయంలో ఆర్టిఫిషియల్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సాంకేతిక రంగంలో రాణించదలచిన విద్యార్థులు తమ సబ్జెక్టులపై పూర్తి పట్లు సాధించాలన్నారు. వారం రోజుల పాటు నిర్వహిస్తున్న సెమినార్‌తో విద్యార్థులకు ఉపయోగ పడే అనేక కొత్త విషయాలను వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫేసర్ రాము, కళాశాల చైర్మన్ జె.నర్సింహ్మారెడ్డి, కార్యదర్శి జె.త్రిశూల్ రెడ్డి, కోషాధికారి త్రిలోక్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ రోబోస్, అనిమేషన్‌లతే
ఘట్‌కేసర్ రూరల్: భవిష్యత్ రోబోటిక్స్, అనిమేషన్‌లదేనని ఐఈఈఈ హైదరాబాద్ రోబోటిక్స్ అండ్ అనిమేషన్ సెక్షన్ చైర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీలో సోమవారం జరిగిన రోబోటిక్స్ అండ్ అనిమేషన్‌లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోవు కాలమంత రోబోటిక్స్, అనిమేషన్‌దేనన్నారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని తెలిపారు. మేథాశక్తికి పదనుపెట్టాలని సూచించారు. ఇలాంటి సదస్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ విభాగం హెచ్‌వోడీ శ్రీనివాస చలపతి, మధు, కుమార్, స్వాతి, ప్రజ్వల్, సన్ని, చరణ్ తదితరులు పాల్గొన్నారు.