శ్రమదానంతో బీటీ రోడ్డు మరమ్మతు

ABN , First Publish Date - 2023-03-30T23:49:55+05:30 IST

మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి నుంచి మాడ్గుల మండలం చంద్రాయన్‌పల్లికి వెళ్లే బీటీ రోడ్డుపై ఏర్పడిన గోతులను మాలేపల్లి గ్రామస్తులు, యువజన సంఘాల సభ్యులు గురువారం శ్రమదానంతో మట్టిపోసి చదును చేశారు.

శ్రమదానంతో బీటీ రోడ్డు మరమ్మతు

ఆమనగల్లు, మార్చి 30 : మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి నుంచి మాడ్గుల మండలం చంద్రాయన్‌పల్లికి వెళ్లే బీటీ రోడ్డుపై ఏర్పడిన గోతులను మాలేపల్లి గ్రామస్తులు, యువజన సంఘాల సభ్యులు గురువారం శ్రమదానంతో మట్టిపోసి చదును చేశారు. రెండు జిల్లాలను కలిపే ఈ రోడ్డుపై అడుగడుగునా కంకరతేలి గోతులేర్పడి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నపించినా స్పందన లేదన్నారు. తలాకొంత డబ్బు పోగుచేసుకొని ట్రాక్టర్‌తో మట్టి తెప్పించి గోతులను పూడ్చి చదును చేశారు.

Updated Date - 2023-03-30T23:49:55+05:30 IST