రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2023-04-22T00:21:20+05:30 IST

కేసీఆర్‌ 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తూంకుంట మున్సిపల్‌ రెడ్డి సంఘం నాయకుడు జైపాల్‌రెడ్డి అన్నారు.

రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి
రెడ్ల సంఘం సమ్మేళన పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సంఘ నాయకులు

23న రెడ్ల ఆత్మీయ సమ్మేళనం

శామీర్‌పేట, ఏప్రిల్‌ 21: కేసీఆర్‌ 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తూంకుంట మున్సిపల్‌ రెడ్డి సంఘం నాయకుడు జైపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరయంజాల్‌లో సంఘం నాయకులు రెడ్ల ఆత్మీయ సమ్మేళన వాల్‌పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 23న కీసరలోని కేబీఆర్‌ గార్డెన్‌లో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమానికి జిల్లా రెడ్ల సంఘం నాయకులు, కార్యకర్తలు, సభ్యులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు కట్ట శశిధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-22T00:21:20+05:30 IST