శంషాబాద్‌ విమానాశ్రయంలో రెడ్‌ అలర్ట్‌

ABN , First Publish Date - 2023-01-26T00:01:09+05:30 IST

గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని అధికారులు శంషాబాద్‌ విమానాశ్రయం లోపల, వెలుపల రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

శంషాబాద్‌ విమానాశ్రయంలో రెడ్‌ అలర్ట్‌

శంషాబాద్‌ రూరల్‌, జనవరి 25: గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని అధికారులు శంషాబాద్‌ విమానాశ్రయం లోపల, వెలుపల రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ నెల 17 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు రెడ్‌ అలర్ట్‌ అమల్లో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొ న్నారు. ఎయిర్‌పోర్టులోని అన్ని ప్రాంతాలను సీఎ్‌సఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ భద్రతా బలగాలు, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పాసులనూ అనుమతించడం లేదు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తనిఖీలు నిర్వహించిన తరువాతనే ఎయిర్‌పోర్టులోకి అనుమతిస్తున్నారు.

Updated Date - 2023-01-26T00:01:11+05:30 IST