Share News

ఉపాధ్యాయుల కుటుంబాలకు అండగా పీఆర్‌టీయూ

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:39 PM

ఉపాధ్యాయుల కుటుంబాలకు పీఆర్‌టీయూ టీఎస్‌ అండగా ఉంటుందని అ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డిలు అన్నారు.

ఉపాధ్యాయుల కుటుంబాలకు అండగా పీఆర్‌టీయూ
చెక్కు అందజేస్తున్న శ్రీపాల్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి

మొయినాబాద్‌ రూరల్‌, డిసెంబరు 18: ఉపాధ్యాయుల కుటుంబాలకు పీఆర్‌టీయూ టీఎస్‌ అండగా ఉంటుందని అ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డిలు అన్నారు. ఇటీవల హిమాయత్‌ నగర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు పట్లోళ్ల అనంతరెడ్డి ఆనారోగ్యంతో మృతి చెందారు. దీంతో చేవెళ్ల మండలం అల్లవాడలోని అనంతరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ త్వరలోనే కారుణ్య నియామకం ద్వారా కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించేలా చూస్తామని హామీనిచ్చారు. సంఘం తరఫున మృతుడి కుటుంబ సభ్యులకు రూ. లక్ష చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా అనంతరెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కమలాకర్‌రావు, నాయకులు గుర్రం చెన్నకేశవ రెడ్డి, కన్నయ్య, గోవర్దన్‌ యాదవ్‌, సామల మహేందర్‌రెడ్డి, జక్కని బందయ్య, కృష్ణ, నారాయణ గౌడ్‌, కృష్ణారెడ్డి, సత్తయ్యగౌడ్‌, వినోద్‌, సుదర్శన్‌, కృష్ణ, హనుమంత్‌, శ్రీనివా్‌సరెడ్డి, లక్ష్మణ్‌, రాములు, నరేందర్‌, నారాయణ, నరేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:39 PM