మిషన్ భగీరథ నీటి కోసం ట్యాంక్‌లోకి దిగి వార్డు సభ్యుడి నిరసన
ABN , First Publish Date - 2023-03-18T23:57:48+05:30 IST
ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్దలో 15 రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదు. సమస్యపై అధికారులు పట్టించుకోవడం లేదని 3వ వార్డు సభ్యుడు రవికుమార్ శనివారం వినూత్న నిరసన తెలిపాడు.

షాద్‌నగర్ రూరల్, మార్చి 18: ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్దలో 15 రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదు. సమస్యపై అధికారులు పట్టించుకోవడం లేదని 3వ వార్డు సభ్యుడు రవికుమార్ శనివారం వినూత్న నిరసన తెలిపాడు. పరిగి రోడ్డు పక్కనున్న ట్యాంక్‌లోకి దిగి పరిస్థితిని తెలియజెప్పాడు. ఇదే విషయమై సర్పంచ్ లలిత మాట్లాడుతూ.. నీటి సమస్యపై అధికారులకు చెబుతున్నా పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.