రోడ్డు పనులు ప్రారంభించాలని నిరసన
ABN , First Publish Date - 2023-05-31T23:40:51+05:30 IST
రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని బుధవారం కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.
షాద్‌నగర్ రూరల్, మే 31: రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని బుధవారం కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం నుంచి చిల్కమర్రి రోడ్డు వరకు రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదని కాంగ్రెస్ పార్టీ కమ్మదనం గ్రామ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ కమ్మదనం గ్రామ కమిటీ అధ్యక్షుడు దేవరి నవీన్ ఆధ్వర్యంలో శిలాఫలకం వద్ద నిరసన తెలిపారు. ఈ విషయమై పంచాయత్‌రాజ్ డీఈ చిరంజీవులును వివరణ కోరగా.. టెండర్ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారని, టెండర్ రద్దు చేసి రీ టెండర్ పిలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో దేవగిరి అమర్నాథ్, లక్ష్మయ్య, నర్సింహ్మ, రాజు, శేఖర్, యాదయ్య, జగన్, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.