మహిళల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం
ABN , First Publish Date - 2023-07-04T23:18:57+05:30 IST
మహిళా సంక్షేమానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టిందని మేడ్చల్ జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.
డీఎంహెచ్‌వో శ్రీనివాస్
మేడ్చల్ జూలై 4(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మహిళా సంక్షేమానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టిందని మేడ్చల్ జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి మంగళవారం పీహెచ్‌సీల్లో 8 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలైన రక్త పరీక్ష నుంచి క్యాన్సర్ స్ర్కీనింగ్ వరకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 30ప్రాథమిక, పట్టణ, బస్తీదవాఖానాల్లో మహిళా వైద్యాధికారిణి ద్వారా వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతి మహిళ ఈసేవలను వినియోగించుకోవాలని డీఎంహెచ్‌వో కోరారు.