సరియైున ఆర్థిక వ్యవహారాలే కాపాడుతాయి

ABN , First Publish Date - 2023-02-13T22:27:00+05:30 IST

సరియైున ఆర్థిక వ్యవహారాలే మిమ్ములను మోసపోకుండా కాపాడుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు.

సరియైున ఆర్థిక వ్యవహారాలే కాపాడుతాయి
మూడుచింతలపల్లిలో ర్యాలీని ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ అభిషేక్‌అగస్య్త

వికారాబాద్‌, ఫిబ్రవరి 13 : సరియైున ఆర్థిక వ్యవహారాలే మిమ్ములను మోసపోకుండా కాపాడుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్‌ కలెక్టరేట్‌లో ఫైనాన్షియల్‌ లెటరసీ వారోత్సవాల్లో భాగంగా పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈనెల13 నుంచి 17 వరకు లిటరసీ క్యాంపులు నిర్వహించి సైబర్‌ నేరాలు, యాప్‌ల ద్వారా రుణాల జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, ఆర్డీవోలు విజయకుమారి, అశోక్‌కుమార్‌ఎల్‌డీఎం రాంబాబు, బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు

మూడుచింతలపల్లి, : ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా మూడుచింతలపల్లిలో సోమవారం 2కే రన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంచి ఆర్ధిక అలవాటు మిమల్ని కాపాడుతుంది అనే పోస్టర్‌ను మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ అభిషేక్‌అగస్త్య అవిష్కరించి, ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్‌ లావాదేవీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలు ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, డిజిటల్‌ లావాదేవీలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఓటీపీ, సీవీవీ నెంబర్లు, భ్యాంక్‌ ఖాతా వివరాలను ఇతరులతో పంచుకోరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌డీఎం కిషోర్‌కుమార్‌, డీపీవో రమణమూర్తి, ఎంపీపీ హారికమురళీగౌడ్‌, ఎంపీడీవో రవినాయక్‌, వైస్‌ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచులు జాము. రవి, సీంగం. ఆంజనేయులు, హరిమోహన్‌రెడ్డి, ఎంపీటీసీ నాగరాజు, గౌస్‌ పాషా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-13T22:27:01+05:30 IST