ప్రవేశ్ శుక్లాను ఉరితీయాలి
ABN , First Publish Date - 2023-07-09T23:59:47+05:30 IST
మద్యప్రదేశ్‌లో దస్మత్ రావత్ అనే గిరిజన యువకుడిపై మూత్రవిసర్జన చేసిన ప్రవేశ్ శుక్లాను బహిరంగంగా ఉరితీయాలని ప్రబుద్ద భారత్ సంస్థ ప్రతినిధి మీసాల అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఘట్‌కేసర్, జూలై 9: మద్యప్రదేశ్‌లో దస్మత్ రావత్ అనే గిరిజన యువకుడిపై మూత్రవిసర్జన చేసిన ప్రవేశ్ శుక్లాను బహిరంగంగా ఉరితీయాలని ప్రబుద్ద భారత్ సంస్థ ప్రతినిధి మీసాల అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఘట్‌కేసర్‌లో ఆదివారం అంబేడ్కర్‌కు నివాళి కార్యక్రమంలో భాగంగా ఇంతేజామ్ కమిటీ ప్రతినిధులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్, సయ్యద్ షానూర్ మాట్లాడుతూ.. నేటికీ గిరిజనులపై క్రూరమైన దాడులు జరగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగిన తర్వాత ఆరాష్ట్ర ముఖ్యమంత్రి దస్మత్ రావత్‌ను ఇంటికి పిలిపించి కాళ్లు కడిగిన దృశ్యాలను మనువాదులు జోరుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. సీఎం కాదు స్వయంగా ప్రధానియే కాళ్లు కాడిగినా తప్పులేదన్నారు. ఈఘటనపై ప్రత్యేక విచారణ జరిపి గిరిజనులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయికిరణ్, దాసు, నర్సింగ్ రావు, శ్రీనివాస్, అన్వర్, రాజేష్ కుమార్, వహిద్, అంజద్, రఫీక్, యాసీన్, మస్తాన్, ఖైరుపాషా, నికిల్, అంజయ్య, అనుష్ శివ, రవి పాల్గొన్నారు.