జిల్లా కొత్త అదనపు కలెక్టర్లుగా ప్రతిమసింగ్, భూపాల్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-07-14T23:50:06+05:30 IST
ఎన్నికలు సపీస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. 31మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్వర్వులు జారీ చేశారు.
ప్రతీక్ జైన్ బదిలీ
రంగారెడ్డి అర్బన్, జూలై 14: ఎన్నికలు సపీస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. 31మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్వర్వులు జారీ చేశారు. ఇందులో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ప్రతీక్‌జైన్ భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బదిలీ అయ్యారు. అయన స్థానంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్‌గా(స్థానికసంస్థలు) విధులు నిర్వహించిన ప్రతిమసింగ్ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఆమె నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. అలాగే రాష్ట్రంలో భారీగా ఆర్డీవోల బదిలీలు జరిగాయి. భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారిగా(స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్) విధులు నిర్వహిస్తున్న ఎంవీ.భూపాల్‌రెడ్డికి రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా(రెవెన్యూ) పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ అదనపు కలెక్టర్‌గా పనిచేసిన తిరుపతిరావు ఇటీవలే వికారాబాద్ డీఆర్వోగా బదిలీ అయ్యారు.