ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:44 PM
ప్రజావాణి కార్యక్రమంలో బాధితులు ఇచ్చే ఫిర్యాదలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భారతి హొలికేరీ అధికారులను అదేశించారు.
జిల్లా కలెక్టర్ భారతిహొలికేరీ
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 18 : ప్రజావాణి కార్యక్రమంలో బాధితులు ఇచ్చే ఫిర్యాదలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భారతి హొలికేరీ అధికారులను అదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. సోమవారం మొత్తం 176 ఫిర్యాదులు అధికారులకు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై స్పందించాలన్నారు. బాధితుల నుంచి వచ్చిన అర్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో పెట్టరాదని ఆమె తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.