ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:25 PM
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరు ఆఽధ్యాత్మికతను అలవర్చుకోవాలని, తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ కాశీవిశ్వనాథ స్వామి-మాత అన్నపూర్ణదేవి ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
మొయినాబాద్ రూరల్, డిసెంబరు 17 : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరు ఆఽధ్యాత్మికతను అలవర్చుకోవాలని, తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ కాశీవిశ్వనాథ స్వామి-మాత అన్నపూర్ణదేవి ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్వతీపరమేశ్వరుల వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్పీకర్ ప్రసాద్‌కుమార్ పాల్గొని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానసిక ప్రశాంతత దేవాలయాల్లోనే లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆఽధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. ఆలయ వార్షికోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఇన్‌చార్జి పామెన భీంభరత్, టీపీసీసీ సభ్యులు షాబాద్ దర్శన్, ఆలయ వ్యవస్థాపక ధర్మకర,్త చైర్మన్ పురాణం మఠం వీరభద్రస్వామి, ధర్మకర్తలు పురాణం మఠం గిరిజాదేవి, పురాణం మఠం నాగేంద్రస్వామి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శ్రీరాంనగర్ ఎంపీటీసీ సభ్యుడు పట్నం రాంరెడ్డి, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
చేవెళ్లలో స్పీకర్‌కు నాయకుల ఘన సన్మానం
చేవెళ్ల : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు చేవెళ్ల మండల కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం మండల కేంద్రంలోని మోడల్ కాలనీలో స్పీకర్ ప్రసాద్‌కుమార్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా చేవెళ్లకు వచ్చిన ప్రసాద్‌కుమార్‌కు నాయకులు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి, డప్పు చప్పుళ్ల మధ్య ఘన స్వాగతం పలికారు. చేవెళ్ల, షాబాద్ మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్పీకర్‌ను పూలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామెన భీంభరత్, టీపీసీసీ ఉపాధ్యక్షులు జనార్దన్‌రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయ కర్త సత్యనారాయణరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్‌స్వామి, పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు వసంతం, మండలాధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, బుచ్చిరెడ్డి, ఎంపీటీసీ రాములు, సర్పంచ్ శైలజాఆగిరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు సమతారెడ్డి, ప్రధాన కార్యదర్శి సరితారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్‌రెడ్డి, టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్, ఉప సర్పంచ్ గంగి యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, సీనియర్ నాయకులు కె.నారాయణాదాస్, పాండు, నర్సింలు, రాజు, కుమార్, శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.