ప్రజలకు అందుబాటులో తపాలా సేవలు
ABN , First Publish Date - 2023-09-21T23:31:30+05:30 IST
ప్రతి వ్యక్తికి తపాలా సేవలు అందించాలనే లక్ష్యంతో తపాలా శాఖ డాక్ కమ్యూనిటీ సేవలను నిర్వహిస్తోందని తెలంగాణ రాష్ట్ర సర్కిల్ తపాలా శాఖ సీపీఎంటీ ఐపీఓ కె.ప్రకాష్, సికింద్రాబాద్ ఐపీఓ ఎస్‌ఎ్‌సపీఓ వై.సురేష్ అన్నారు.
మేడ్చల్ టౌన్, సెప్టెంబరు 21: ప్రతి వ్యక్తికి తపాలా సేవలు అందించాలనే లక్ష్యంతో తపాలా శాఖ డాక్ కమ్యూనిటీ సేవలను నిర్వహిస్తోందని తెలంగాణ రాష్ట్ర సర్కిల్ తపాలా శాఖ సీపీఎంటీ ఐపీఓ కె.ప్రకాష్, సికింద్రాబాద్ ఐపీఓ ఎస్‌ఎ్‌సపీఓ వై.సురేష్ అన్నారు. గురువారం మేడ్చల్ ఎంపీడీఓ కార్యాలయంలో తపాల శాఖ ఆధ్వర్యంలో డాక్ కమ్యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులు ప్రకాష్, సురే్‌షలు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా సేవలందిస్తున్న తపాలా శాఖ కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రజలకు సేవలందిస్తోందన్నారు. తపాలా శాఖ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. చిన్న మొత్తాల పొదుపు, బీమా, సేవింగ్ బాండ్స్, బాలికల కోసం సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మనీ ఆర్డర్లు, పాస్‌పోర్టు సేవలు, ఆధార్ సేవలు, పొదుపు ఖాతాల లావాదేవీలపై డిజటల్ విధానంలో సేవలందించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలను విస్తరింపజేసేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. తపాలా సేవలపై గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీపీ రజితరెడ్డి కోరారు. నిరుపేదలకు తపాలా సేవలను అందుబాటులోకి తెస్తేనే శాఖను ప్రజలు ఆదరిస్తారని జెడ్పీటీసీ శైలజ అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆధార్ కార్డులో చిరునామా, ఫొటోలు, పేర్ల మార్పుచేర్పులపై స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ పద్మావతి, డిప్యుటీ సీఈఓ సరిత, కౌన్సిలర్లు స్వామియాదవ్, ఎ.శ్రీనివా్‌సరెడ్డి, మానసశ్రవణ్‌కుమార్, మహేష్, తపాలా అధికారులు శ్రీనివాస్, దండప్ప, వెంకన్న, హేమవాణి, రాజగోపాల్ పాల్గొన్నారు.