Share News

పోలీసులు అంకితభావంతో పనిచేయాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:37 PM

పోలీస్‌ అధికారులు అంకితభావంతో పనిచేయాలని శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం జిల్లేడ్‌ చౌదరిగూడ మండల కేంద్రంలోని పోలీ్‌సస్టేషన్‌ను తనిఖీ చేశారు.

పోలీసులు అంకితభావంతో పనిచేయాలి
జిల్లేడ్‌ చౌదరిగూడ పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న డీసీపీ నారాయణరెడ్డి

శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి

చౌదరిగూడ, డిసెంబరు 18: పోలీస్‌ అధికారులు అంకితభావంతో పనిచేయాలని శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం జిల్లేడ్‌ చౌదరిగూడ మండల కేంద్రంలోని పోలీ్‌సస్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీ్‌సస్టేషన్‌లో రోజువారీగా నమోదవుతున్న ఫిర్యాదులు, కేసుల రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ కేసు వివరాలను షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ లక్ష్మీరెడ్డి, ఎస్‌. సక్రంలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, ఫిర్యాదుదారులకు భద్రత, భరోసా కల్పించాలన్నారు. దొంగతనాల నిర్మూలనకు, అనుమానిత వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అత్యవసర సమయంలో డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. విధి నిర్వహణలో పోలీసులు పాటించాల్సిన నియమ నిబంధనలపై పలు సూచనలు చేశారు. విధుల పట్ల ఎవరైనా అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొందుర్గు ఎస్‌ఐ కృష్ణ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:37 PM