‘లేఖల’పై పిన్‌కోడ్ నెంబర్ సక్రమంగా రాయాలి
ABN , First Publish Date - 2023-08-05T00:13:02+05:30 IST
దూర ప్రాంతాలకు ఉత్తరప్రత్యుత్తరాల(లేఖలు)ను పంపేవారు పిన్‌కోడ్ నెంబర్ సక్రమంగా రాయాలని మండల సబ్ పోస్ట్‌మాస్టర్ రావుల శివ ఓ ప్రకటనలో తెలిపారు.
యాచారం/శంషాబాద్‌రూరల్, ఆగస్టు 4 : దూర ప్రాంతాలకు ఉత్తరప్రత్యుత్తరాల(లేఖలు)ను పంపేవారు పిన్‌కోడ్ నెంబర్ సక్రమంగా రాయాలని మండల సబ్ పోస్ట్‌మాస్టర్ రావుల శివ ఓ ప్రకటనలో తెలిపారు. పిన్‌కోడ్ నెంబర్ తప్పుగా రాయడంతో ఉత్తర ప్రత్యుత్తరాలు ఆలస్యంగా చేరుకుంటాయని తెలిపారు. మండలంలోని గున్‌గల్, గడ్డమల్లాయగూడ గ్రామాల వారు ఇబ్రహీంపట్నం పిన్‌కోడ్ నెంబర్ 501506 రాయాలని, మాల్, వేంకటేశ్వర్‌నగర్‌కు చెందినవారు మర్రిగూడ పిన్‌కోడ్ నెంబర్ 508245 రాయాలని, యాచారం పోస్టాఫీస్ పరిధిలోని తులేకలాన్(ఇబ్రహీంపట్నం మండల పరిధి) ఆకులమైలారం, పంజగూడ, మాలగూడ, మీర్‌ఖాన్‌పేట, బేగరికంచ కందుకూరు మండల పరిధిలో ఉండగా పిన్ కోడ్ నెంబర్ 501509 రాయాలని, కందుకూరు మండలంలోని పోతుబండ తండా, సార్లరావుల పల్లి గ్రామాలవారు 509358 నెంబర్ రాయాలని సూచించారు. అదేవిధంగా సరైన పిన్‌కోడ్ రాస్తేనే ఉత్తరాలు అందటంలో జాప్యం ఉండదని శంషాబాద్ పోస్టు మాస్టర్ శేఖర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు శంషాబాద్ మండలం సాతంరాయి, గగన్‌పహాడ్, తొండుపల్లి, కిషన్‌గూడ, ఊట్‌పల్లి ప్రజలు 501218 పిన్‌కోడ్‌ను రాయకుండా 500052 పిన్‌కోడ్‌ను రాయాలని సూచించారు. ఊట్‌పల్లి, కిషన్‌గూడ, తొండుపల్లి, మధురనగర్, నెక్సా షోరూం, ఇందిరనగర్ దొడ్డి, ప్రభుత్వ క్వార్టర్స్ ప్రాంతాలవారు 509325 పిన్‌కోడ్ రాయాలని సూచించారు. ఆర్‌జీఐఏ ప్రాంతం వారు 500108 పిన్‌కోడ్ రాయాలని, ఇది ప్రజలు గమనించాలని కోరారు.