పాదయాత్రగా శ్రీశైలానికి తరలిన శివ స్వాములు
ABN , First Publish Date - 2023-01-18T00:02:15+05:30 IST
తాండూరు నుంచి శ్రీశైలా నికి శివస్వాములు పాదయాత్రగా తరలారు.
తాండూరు రూరల్/కొడంగల్ రూరల్, జనవరి 17: తాండూరు నుంచి శ్రీశైలా నికి శివస్వాములు పాదయాత్రగా తరలారు. మంగళవారం బీఆర్‌ఎస్ తాండూరు ప్రచార కార్యదర్శి సాగర్‌గౌడ్ ఆధ్వర్యంలో తాండూరు నుంచి శివస్వాములు శ్రీశైలం పాదయాత్ర చేపట్టారు. భద్రేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. సుమారు 150మంది పాదయాత్రగా తరలి వెళ్లారు. అలాగే తాండూరు పరిసర ప్రాంతాలకు చెందిన శివమాల ధారులు 40 మందికిపైగా కొడంగల్ మీదుగా పాదయాత్రగా శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. కాగా పాత తాండూరు శ్రీ కోటేశ్వర ఆలయ శివ స్వాములు మంగళవారం ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ నివాసంలో ఆయనను కలిసి తమకు ఆశ్రమం కావాలని కోరారు. ఆశ్రమం ఏర్పాటుకు కృషి చేస్తాని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శివ స్వాములకు హామీ ఇచ్చారు.