పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-04-03T23:45:24+05:30 IST
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు అధికారులను ఆదేశించారు.
జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు
రంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 3 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఆర్వో హరిప్రియతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో 70 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.