Share News

పీసీసీ చీ్‌ఫ్‌ రేవంత్‌రెడ్డి బ్లాక్‌ మెయిలర్‌

ABN , First Publish Date - 2023-10-30T23:17:27+05:30 IST

రేవంత్‌రెడ్డి ఒక బ్లాక్‌మెయిలర్‌ అని, తననే బ్లాక్‌ మెయిల్‌ చేసిన దొంగ రేవంత్‌రెడ్డి అని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఘాటుగా విమర్శించారు.

పీసీసీ చీ్‌ఫ్‌ రేవంత్‌రెడ్డి బ్లాక్‌ మెయిలర్‌
మరుగుజ్జులను తన భుజాలపై కూర్చోబెట్టుకున్న మంత్రి మల్లారెడ్డి

మైనంపల్లి పిల్లి అయ్యారు

దొంగ ప్లాట్లు అమ్ముకున్న వజ్రేష్‌యాదవ్‌

బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ టౌన్‌ అక్టోబరు 30 : రేవంత్‌రెడ్డి ఒక బ్లాక్‌మెయిలర్‌ అని, తననే బ్లాక్‌ మెయిల్‌ చేసిన దొంగ రేవంత్‌రెడ్డి అని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఘాటుగా విమర్శించారు. సోమవారం మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పరిధి కండ్లకోయలోని నిమ్మల గార్డెన్స్‌లో బీఆర్‌ఎస్‌ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి హాజరై మాట్లాడారు. మేడ్చల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్ధి పేరు కూడా ప్రజలకు తెలియదని, దొంగ ప్లాట్లు అమ్ముకున్న వ్యక్తి వజ్రే్‌షయాదవ్‌ అన్నారు. మైనంపల్లి పిల్లా అయ్యాడని రౌడీయిజంతో భూ కబ్జాలు చేసి ప్రజనలు దోచుకున్నాడని, తెలంగాణాలో వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసేందుకు సిద్దమయ్యారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలకు మంత్రి దిశానిర్ధేశం చేశారు. మేడ్చల్‌ మరో హైటెక్‌ సిటీ కాబోతుందని ప్రభుత్వ పథకాలను ప్రజల్లో విస్త్రతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. తాము చేసిన అభివృద్ది చూసే కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరాలని పార్టీ శ్రేణులకు మంత్రి సూచించారు.

Updated Date - 2023-10-30T23:17:27+05:30 IST