అభివృద్ధిలో భాగస్వాములవ్వండి

ABN , First Publish Date - 2023-07-04T00:41:47+05:30 IST

గ్రామాల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధిలో భాగస్వాములవ్వండి

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

మంచాల, జూలై 3 : గ్రామాల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిత్తాపూర్‌కు చెందిన బీజేపీ నాయకులు సోమవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి ఆయన సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమపథకాలకు ఆకర్షితులై బీఆర్‌ఎ్‌సలో చేరడానికి యువత ముందుకు వస్తున్నారని చెప్పారు. బీఆర్‌ఎ్‌సలో చేరినవారిలో జి.రమేష్‌, జి.శ్రీను, పి.మహే్‌షలు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చీరాలరమేష్‌, పీఏసీస్‌ చైర్మన్‌ బుస్సు పుల్లారెడ్డి, వైస్‌చైర్మన్‌ యాదయ్య, డి.సత్యనారాయణ, శ్రీశైలం, పల్లెజంగారెడ్డి, రావుల కృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-04T00:41:47+05:30 IST