బహుజనుల ఆరాధ్యుడు పాపన్నగౌడ్
ABN , First Publish Date - 2023-05-02T23:50:25+05:30 IST
బహుజనుల ఆరాధ్యుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని పరిగి ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డి అన్నారు. మండలంలోని ఇప్పాయిపల్లిలో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కులకచర్ల, మే 2: బహుజనుల ఆరాధ్యుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని పరిగి ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డి అన్నారు. మండలంలోని ఇప్పాయిపల్లిలో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా పాపన్నగౌడ్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌడకులస్థులు కష్టపడి పనిచేస్తారని, వారిసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని తెలిపారు. విగ్రహం ఏర్పాటుకు రూ.50వేల విరాళాన్ని అందజేశారు. అఅలాగే పాపన్నగౌడ్ కమ్యూనిటీ భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే నిధుల నుంచి మొదటగా రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నానని, మరో రూ.5 లక్షలు రెండో విడుతలో మంజూరు చేస్తామని తెలిపారు. అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు రూ.50వేలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీత సంఘం అధ్యక్షుడు బాల్‌రాజ్‌గౌడ్, కన్వీనర్ ఎ.వెంకన్నగౌడ్, బీజేపీ రాష్ట్ర కిసాన్‌మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్‌గౌడ్, ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందా్‌సనాయక్, సర్పంచ్ అనురాధబాల్‌రెడ్డి, పద్మరఘుగౌడ్, భీంరెడ్డి, ఆంజనేయులుగౌడ్, సుధాకర్‌రెడ్డి, నాగరాజు, మహిపాల్, చంద్రలింగం, కృష్ణయ్యగౌడ్, రాములుగౌడ్, శ్రీనివా్‌సగౌడ్, రాఘవేందర్‌గౌడ్, సంధ్యాఆనంద్, నర్సింహులు, రాములుగౌడ్, మల్లయ్యగౌడ్ పాల్గొన్నారు.