పనంటే ప్రాణం.. అందుకే ప్రాణాలకు తెగించి
ABN , First Publish Date - 2023-08-02T00:03:41+05:30 IST
ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే కొందరు నెలసరి వేతనాలు తీసుకుంటున్నా తమ పనులు చేయాలంటే బద్దకంగా ఉంటారు. మరి కొందరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారనేందుకు ఈ ఫొటోనే నిదర్శనం.. ఎంతటి ప్రమాదకర పరిస్థితి ఏర్పడినా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు.
బొంరా్‌సపేట్, ఆగస్టు 1: ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే కొందరు నెలసరి వేతనాలు తీసుకుంటున్నా తమ పనులు చేయాలంటే బద్దకంగా ఉంటారు. మరి కొందరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారనేందుకు ఈ ఫొటోనే నిదర్శనం.. ఎంతటి ప్రమాదకర పరిస్థితి ఏర్పడినా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. బొంరా్‌సపేట్ మండలంలోని విద్యుత్ శాఖలో పని చేస్తున్న సిబ్బంది అందుకు నిలువెత్తు సాక్ష్యమని చెప్పవచ్చు. వారం రోజులు కురిసిన భారీ వర్షాలతో బొంరా్‌సపేట మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాలకు అక్కడక్కగా విద్యుత్ వైర్లు తెగిపోయి బ్రెక్ డౌన్ కావడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. మండల పరిధిలోని ఏర్పుమళ్ల, బురాన్‌పూర్ విద్యుత్ లైన్లు బ్రెక్ డౌన్ కావడంతో ఆయా గ్రామ పరిధిలోని సుద్దకుంట, బురాన్‌పూర్, తాటికుంటలో వైర్లు తెగిపోయాయి. దీంతో ఆయా పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫఱా నిలిచిపోయింది. పనంటే ప్రాణంగా ప్రేమించే సంబంధిత గ్రామ జూనియర్ లైన్‌మెన్‌లు ప్రాణాలకు తెగించి ఆ కుంటలో ఈదుకుంటూ వెళ్లి లైన్‌లను మెరుగు పర్చి చీకటి గ్రామాల్లో వెలుగులు నింపారు. విధి నిర్వాహణలో వారు చూపిన తెగువకు మండల ప్రజలు హ్యట్సప్ అంటూ అభినందించారు.