పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం త్వరలో పూర్తి
ABN , First Publish Date - 2023-06-07T23:46:57+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తిచేసి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, జూన్ 7 : కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తిచేసి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మహేశ్వరంలో నిర్వహించిన సాగునీటి దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మూడేళ్లలో భారీ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండితే.. నేడు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తూ పంజాబ్ రాష్ర్టాన్ని మించిపోయిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు జలకల సంతరించుకొని సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు మత్సకారులకు జీవనోపాధి పొందుతున్నారు. రాష్ట్రంలోని ప్రాచీన కట్డడాలు, దేవాలయాలకూ మహర్దశ రాబోతుందని, అందులోభాగంగా మహేశ్వరం నియోజకవర్గలోని పురతన కట్టడాలు, దేవాలయాల అభివృద్ధికి సుమారు రూ.9 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. బుధవారం మహేశ్వరంలోని అతి పురాతన మెట్లబావి(కోనేరు) పుణరుద్ధరణ పనులకు రూ. 90 లక్షలతో మంత్రి శంకుస్థాపన చేశారు.
చెక్కుల పంపిణీ
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో పేదింటి ఆడబ్డిలకు కొండంత అండ లభిస్తుందని మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరంలో 65మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్‌గుప్త, ఎంపీపీ కె. రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ ఆర్.సునితఅంద్యానాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, రైతు సమితి జిల్లా కమిటీ సభ్యుడు కూన యాదయ్య, వైస్ చైర్మన్లు నందం, వెంకటేశ్వర్‌రెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్, మల్లే్‌షయాదవ్, నవీన్, రాజునాయక్, చంద్రయ్య, యాదయ్య, మిద్దింటి బాల్‌రాజ్, కాడమోని ప్రభాకర్, ఆదిల్‌అలీ, అంబయ్యయాదవ్ పాల్గొన్నారు.