కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం

ABN , First Publish Date - 2023-06-11T00:07:38+05:30 IST

దివ్యాంగుల పింఛన్‌ వెయ్యి రూపాయలు పెంచడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి దివ్వాంగులు పాలాభిషేకం చేశారు.

కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం
షాద్‌నగర్‌ అర్బన్‌ : కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న దివ్వాంగులు

షాద్‌నగర్‌ అర్బన్‌/కేశంపేట/ఆమనగల్లు, జూన్‌ 10: దివ్యాంగుల పింఛన్‌ వెయ్యి రూపాయలు పెంచడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి దివ్వాంగులు పాలాభిషేకం చేశారు. ఈమేరకు షాద్‌నగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి శనివారం దివ్వాంగులు చేరుకుని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ సమక్షంలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. పెద్దన్నలా ప్రతి నెలా పెన్షన్‌ ఇచ్చి ఆదుకుంటున్న కేసీఆర్‌ వెన్నంటే ఉంటామని దివ్వాంగులు తెలిపారు. అదేవిధంగా పింఛన్‌ పెంపు నిర్ణయం పట్ల కేశంపేట మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో దివ్యాంగులు ముఖ్యమంత్రి కేసీఆర్‌, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి దివ్యాంగుల పక్షపాతిగా వారు అభివర్ణించారు. కార్యక్రమంలో బైర్కాన్‌పల్లి సర్పంచ్‌ కృష్ణయ్య, డీఆర్‌డీఏ ఏపీఎం భగవంతు, దివ్యాంగుల సంఘం మండలాధ్యక్షుడు మైసయ్య, కార్యదర్శి యాదమ్మ, చిట్టెమ్మ, బీఆర్‌ఎస్‌ నాయకులు మురళీ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని జడ్పీటీసీ అనురాధపత్యనాయక్‌ అన్నారు. దివ్యాంగుల ఆసరా పింఛన్‌ను రూ.4016కు పెంచుతున్నట్లు ప్రకటించడాన్ని హర్షిస్తూ ఆమనగల్లు పట్టణంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచారు. దివ్యాంగుల సంఘం నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకటయ్య, నాయకులులున్నారు. కాగా, దివ్యాంగుల పెన్షన్‌ను రూ.4116కు పెంచడాన్ని హర్షిస్తూ ఆమనగల్లు పట్టణంలో దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు బొడ్డు శంకర్‌ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు.

Updated Date - 2023-06-11T00:07:38+05:30 IST