ఘనంగా పద్మావతీవేంకటేశ్వరుల కల్యాణోత్సవం
ABN , First Publish Date - 2023-03-19T00:03:27+05:30 IST
మండల పరిధి కప్పాడులో శనివారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పద్మావతీవేంకటేశ్వరస్వామి వారల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.

ఇబ్రహీంపట్నం, మార్చి 18: మండల పరిధి కప్పాడులో శనివారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పద్మావతీవేంకటేశ్వరస్వామి వారల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తిరుమల వింజమూరు రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవం కొనసాగింది. సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, సర్పంచ్ హంసమ్మ, ఆలయ కమిటీ చైర్మన్ బి.మల్లారెడ్డి పెళ్లి పెద్దలుగా కల్యాణోత్సవాన్ని జరిపించారు. వందలాది మంది భక్తులు తిలకించారు. కార్యక్రమంలో కప్పాడు, ఉప్పరిగూడ ఉపసర్పంచ్‌లు మునీర్, నర్సింహారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, జగదీష్, జలందర్‌గౌడ్ పాల్గొన్నారు.