ఒక్క అడుగు పరిశుభ్రత వైపు..

ABN , First Publish Date - 2023-05-21T23:00:43+05:30 IST

స్వచ్ఛతను నెలకొల్పేందుకు ఒక్క అడుగు పరిశుభ్రత వైపు వేయాలని వికారాబాద్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రమేష్‌ అన్నారు.

ఒక్క అడుగు పరిశుభ్రత వైపు..
శానిటేషన్‌ పనులను ప్రారంభిస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల

వికారాబాద్‌ రూరల్‌, మే 21: స్వచ్ఛతను నెలకొల్పేందుకు ఒక్క అడుగు పరిశుభ్రత వైపు వేయాలని వికారాబాద్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రమేష్‌ అన్నారు. ఆదివారం మునిసిపల్‌ పరిధి 8, 9, 16, 22, 23 వార్డుల్లో స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో డ్రైనేజీ క్లీనింగ్‌, చెత్త సేకరణ, పిచ్చి మొక్కల తొలగింపు తదితర కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ శంషాద్‌ బేగం, కౌన్సిలర్లు కిరణ్‌పటేల్‌, ప్రభావతి, ప్యాక్స్‌ వైస్‌ చైర్మన్‌ పాండు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మొహినుద్దీన్‌, సూపర్‌వైజర్‌ వెంకటేష్‌, ఆర్పీలు, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-21T23:00:43+05:30 IST