రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ABN , First Publish Date - 2023-06-26T23:28:59+05:30 IST

ఔటర్‌పై డీసీఎంలో నుంచి మొక్కలను కిందికి దించుతుండగా కంటైనర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

  • మరో ఐదుగురికి తీవ్రగాయాలు

  • కీసర ఓఆర్‌ఆర్‌పై డీసీఎంను ఢీకొన్న కంటైనర్‌

కీసర, జూన్‌ 26: ఔటర్‌పై డీసీఎంలో నుంచి మొక్కలను కిందికి దించుతుండగా కంటైనర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కీసర పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఆహ్మద్‌సాబ్‌ షేక్‌(40) కొంత కాలంగా జవహర్‌నగర్‌ సమీపంలోని మల్కారంలో నివాసముంటూ డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన పార్వతమ్మ, జ్యోతి, పల్లవి, ఈశ్వరి, సరస్వతిలు కూలీలుగా పనిచేస్తున్నారు. కాగా సోమవారం డీసీఎంలో శంషాబాద్‌ నుంచి మొక్కలు తీసుకొని, కీసర ఎగ్జిట్‌ 8 సమీపంలోని ఔటర్‌ రింగ్‌రోడ్డుపై దించుతున్నారు. ఈమేరకు డీసీఎం డ్రైవర్‌ ఆహ్మద్‌ పాషా వెనుక నుంచి వచ్చే వాహనాలను నెమ్మది రండి అని చేతులు ఊపుతూ దారిచూపుతున్నాడు. ఈక్రమంలో ఘట్‌కేసర్‌ నుంచి శామీర్‌పేట వెళ్తున్న కంటైనర్‌ మొక్కలు దించుతున్న డీసీఎంను వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌ అహ్మద్‌సాహెబ్‌ పాషా అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి మృతదేహం నుజ్జునుజ్జయింది. కూలీలుగా పని చేస్తున్న జ్యోతి, పల్లవి, పార్వతమ్మ, సరస్వతి, ఈశ్వరిలకు తీవ్రగాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అహ్మద్‌సాహెబ్‌ పాషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.

Updated Date - 2023-06-26T23:28:59+05:30 IST