రబీ పంటలను పరిశీలన

ABN , First Publish Date - 2023-01-18T23:39:23+05:30 IST

ధారూరు మండల పరిధిలోని కేరెల్లి వ్యవసాయ క్లస్టర్‌లోని బాచారం గ్రామ శివారులో రైతులు అన్‌లైన్‌లో నమోదు చేసుకున్న రబీ పంటలను జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్‌ బుధవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

రబీ పంటలను పరిశీలన
బాచారంలో సాగు చేసిన ఉల్లి పంటను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్‌.

ధారూరు, జనవరి 18: ధారూరు మండల పరిధిలోని కేరెల్లి వ్యవసాయ క్లస్టర్‌లోని బాచారం గ్రామ శివారులో రైతులు అన్‌లైన్‌లో నమోదు చేసుకున్న రబీ పంటలను జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్‌ బుధవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. బాచారం సమీపంలోని రైతు చెన్నారెడ్డి సాగు చేసిన ఉల్లి, పసుపు, చామంతి పంటలను పరిశీలించారు. ఫొటోలు, వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేశారు. అనంతరం మరికొంత మంది రైతుల పంటల వివరాలను సేకరించి నమోదు చేసుకున్నారు. ఆయన వెంట ఏఈవో సుజాత, కేరెల్లి గ్రామ రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ రాంచంద్రారెడ్డి, రైతులు ఉన్నారు.

Updated Date - 2023-01-18T23:39:25+05:30 IST