ఎన్టీఆర్, ఎంపీ శేషయ్యలను ఆదర్శంగా తీసుకోవాలి
ABN , First Publish Date - 2023-02-08T23:37:58+05:30 IST
అభివృద్ధికి, సంక్షేమానికి పునాది వేసిన ఎన్టీఆర్, పౌలీ్ట్ర విస్తరణకు కృషి చేసిన ఎంపీ శేషయ్యలాంటి మహానీయులను ఆదర్శంగా తీసుకోవాలని
షాద్‌నగర్‌అర్బన్, ఫిబ్రవరి 8: అభివృద్ధికి, సంక్షేమానికి పునాది వేసిన ఎన్టీఆర్, పౌలీ్ట్ర విస్తరణకు కృషి చేసిన ఎంపీ శేషయ్యలాంటి మహానీయులను ఆదర్శంగా తీసుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ పిలుపునిచ్చారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని ఎంపీ శేషయ్యనాగరత్నమ్మ కమ్యూనిటీ హాలులో కమ్మ సేవా సమితి షాద్‌నగర్ అధ్యక్షుడు పాతూరి వెంకటరావు, శేషయ్యనాగరత్నమ్మ సేవ ట్రస్టు చైర్మన్ శరత్‌బాబుల నేతృత్వంలో ప్రతిష్ఠించిన ఎన్టీఆర్, శేషయ్యనాగరత్నమ్మల విగ్రహాలను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం అరికెపూడి గాంధీ మాట్లాడుతూ నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల్లో చైతన్యం తెచ్చిన ఎన్టీఆర్ పేదలు కడుపునిండా భోజనం చేయాలని రెండు రూపాయల కిలో బీయ్యం తెచ్చారని, మహిళలు సగౌరంగా జీవించాలని ఆస్థిలో హక్కును కల్పించారని గుర్తు చేశారు. విద్య, వైద్యానికి సైతం ప్రాధాన్యతనిచ్చి, తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచారని అన్నారు. అలాగే పౌలీ్ట్ర విస్తరణ కోసం శేషయ్య విశేషంగా కృషి చేసి వేలాధి మందికి ఉపాధిని కల్పిస్తూ, అభివృద్ధి పర్చారని అన్నారు. అలాంటి మహానీయులను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మార్గదర్శ ఎండి శైలజాకిరణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, తెలంగాణ పౌలీ్ట్ర ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, కమ్మసేవా సమితి నాయకులు పూర్ణచందర్‌రావు, రవీంద్ర, పినపాక ప్రభాకర్, జి. వసంతరావు, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.