అగ్గనూర్‌లో ఎన్‌ఎ్‌సఎస్‌ క్యాంపు

ABN , First Publish Date - 2023-03-25T23:28:29+05:30 IST

అగ్గనూర్‌లో సింధు డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో వారం రోజులుగా ఎన్‌ఎ్‌సఎస్‌ క్యాంపును నిర్వహిస్తున్నారు.

అగ్గనూర్‌లో ఎన్‌ఎ్‌సఎస్‌ క్యాంపు
అగ్గనూర్‌లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న విద్యార్థులు

యాలాల, మార్చి 25: అగ్గనూర్‌లో సింధు డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో వారం రోజులుగా ఎన్‌ఎ్‌సఎస్‌ క్యాంపును నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం గ్రామంలో అధికారిక విద్య, సాధారణ ఉపాధిలో లేని యువతపై సర్వే నిర్వహించారు. ఉపాధి, విద్యపై ఇంటింటికీ వెళ్ళి అవగాహన కల్పించారు. అంతకు ముందు గ్రామంలో హరితహారం, పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌, చైర్మన్‌ విజయాదేవి రంగారావు, ప్రోగ్రాం అధికారి విశ్వనాథంగౌడ్‌, ఎన్‌ఎ్‌సఎస్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:28:29+05:30 IST