మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖకు జాతీయ అవార్డు

ABN , First Publish Date - 2023-03-19T00:12:47+05:30 IST

మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖకు జాతీయస్థాయి అవార్డు దక్కింది.

మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖకు జాతీయ అవార్డు

మేడ్చల్‌మార్చి 18(ఆంధ్రజ్యోతిప్రతినిధి): మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖకు జాతీయస్థాయి అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందజేసే జాతీయ ఇన్నోవేషన్‌ అవార్డు విద్యాశాఖ విభాగంలో జాతీయస్థాయిలో నామినేషన్లు స్వీకరించారు. జాతీయ స్థాయి నిపుణులు వాటిని షార్ట్‌ లిస్టు చేసి అందులో అత్యంత ప్రభావితమైన ఇన్నోవేషన్‌కు జాతీయ స్థాయిలో విద్యాశాఖకు ఇన్నోవేషన్స్‌ ఆధారంగా అవార్డులు అందజేస్తారు. అందులో భాగంగా మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖ కోవిడ్‌, లాక్‌డౌన్‌ సమయంలో చేపట్టిన ఇన్నోవేటీవ్‌ కార్యక్రమం మేడ్చల్‌ బడి.డాట్‌ కామ్‌ నిర్మాణం, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ద్వారా వీడియో పాఠాలను నాణ్యతగా తయారు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా వెబ్‌సైట్‌ తయారు చేసినందుకు అవార్డు దక్కింది. ఈ అవార్డును ఈ నెల 23న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ చేతులమీదుగా డీఈవో విజయకుమారి అందుకోనున్నారు.

Updated Date - 2023-03-19T00:12:47+05:30 IST