రేవంత్‌రెడ్డిని కలిసిన నారాయణరెడ్డి
ABN , First Publish Date - 2023-12-05T23:34:59+05:30 IST
పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డిని మంగళవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆమనగల్లు, డిసెంబరు 5: పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డిని మంగళవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని పలువురు కార్యకర్తలు, నాయకులతో కలిసి గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో రేవంత్‌ను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఎన్నికల సరళి, వచ్చిన మెజార్టీ, స్థానిక రాజకీయ పర్థితులపై ఆయనకు వివరించారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ జెండాను ఎగరవేసినందుకు నాయకులు, కార్యకర్తలను రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీసింగ్, ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు శ్రీనివా్‌సరెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.