Share News

నా గెలుపు షాద్‌నగర్‌ ప్రజలకు అంకితం

ABN , First Publish Date - 2023-12-05T23:15:30+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఆనందంగా ఉందని, నా గెలుపును నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తున్నానని షాద్‌నగర్‌ నూతన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు.

నా గెలుపు షాద్‌నగర్‌ ప్రజలకు అంకితం
కొత్తూర్‌ : జేపీ దర్గాలో ప్రార్థనలు నిర్వహిస్తున్న వీర్లపల్లి శంకర్‌

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

కొత్తూర్‌, డిసెంబరు 5: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఆనందంగా ఉందని, నా గెలుపును నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తున్నానని షాద్‌నగర్‌ నూతన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన వీర్లపల్లి శంకర్‌ మంగళవారం మొట్టమొదటగా కొత్తూర్‌ మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో గల హజ్రత్‌ జహంగీర్‌పీర్‌ దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్‌ దర్గాకు చేరుకోగానే స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వీర్లపల్లి చాదర్‌ను తలపై పెట్టుకుని దర్గాకు చేరుకోగానే ముజావర్లు తలపాగా చుట్టి దర్గాలోపలికి స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముజావర్లు శంకర్‌కు ఆశీర్వాచనాలు, ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే శంకర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని జహాంగీర్‌బాబాను కోరుకున్నట్లు తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన షాద్‌నగర్‌ నియోజవకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ కళ నేరవేరిందన్నారు. నాయకులు ఆగీర్‌ రవికుమార్‌, మహముద్‌, రియాజ్‌, ఆంజనేయుఉలు, బాసు, బుచ్చిబాబు, జహీరోద్దిన్‌, రవినాయక్‌, నర్సింహ్మా, వై. బాబు, కిషన్‌నాయక్‌, ఖాజా, జంగయ్య, శేఖర్‌, శ్రీరాములు, శేఖర్‌, ఖీద్‌, రహీం, ఈశ్వర్‌, శ్రీను, సందాని, రమేష్‌, నసీర్‌, లాలూనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆంజనేయస్వామి ఆలయంలో వీర్లపల్లి పూజలు

షాద్‌నగర్‌అర్బన్‌ : షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ మంగళవారం చౌడమ్మగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా పేరున్న ఆంజనేయస్వామికి పూజలు చేసిన వీర్లపల్లి శంకర్‌ను ఆలయ పూజారులు సన్మానించి, ఆశీర్వదించారు. కాగా, వీర్లపల్లి విజయం సాధిచండం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మోహన్‌ మొక్కుబడి తీర్చుకున్నారు. షాద్‌నగర్‌ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుచరులతో వచ్చిన అందె మోహన్‌ 101 కొబ్బెరి కాయలను కొట్టారు. వీర్లపల్లి శంకర్‌ గెలిచి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని కోరిన కోరికను తీర్చిన వేంకటేశ్వరుడికి మొక్కుబడి తీర్చుకున్నట్లు మోహన్‌ చెప్పారు.

వీర్లపల్లి శంకర్‌కు మంత్రి పదవి ఇవ్వాలి

కొందుర్గు, డిసెంబరు 5: షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఎ.కృష్ణారెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వీర్లపల్లి శంకర్‌ గెలుపుకోసం కృషిచేసిన కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, ఓటువేసి గెలిపించిన మండల ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొందుర్గు మండలంలో బీఆర్‌ఎ్‌సకు 7268 ఓట్లు రాగా, కాంగ్రె్‌సకు 7600 ఓట్లు వచ్చాయని, దీంతో కాంగ్రె్‌సకు 332 ఓట్ల ఆధిక్యం వచ్చిందన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ సహాకారంతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు బండమీది పెంటయ్య, కె రాములు గౌడ్‌, బి నరేందర్‌, బి యాదయ్య, జీవీ కృష్ణయ్య, పద్మయ్య, మాణయ్య, దుర్గని శ్రీను, సి కృష్ణయ్య, రాయికంటి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-05T23:15:30+05:30 IST