పార్టీల గెలుపులో ముదిరాజ్‌లదే కీలకపాత్ర

ABN , First Publish Date - 2023-07-02T23:52:57+05:30 IST

పార్టీల గెలుపులో ముదిరాజ్‌లదే కీలకపాత్ర ఉంటుందని ముదిరాజ్‌సంఘం ఆల్‌ ఇండియా ప్రధానకార్యదర్శి రోటం భూపతి అన్నారు.

పార్టీల గెలుపులో ముదిరాజ్‌లదే కీలకపాత్ర
ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న రోటం భూపతి

  • ఎన్నికల్లో ముదిరాజ్‌లకు 20 సీట్లు కేటాయించాలి

  • ముదిరాజ్‌లకు ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలి

  • ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేనంలో ఆల్‌ఇండియా ప్రధానకార్యదర్శి రోటం భూపతి

పెద్దేముల్‌, జూలై 2: పార్టీల గెలుపులో ముదిరాజ్‌లదే కీలకపాత్ర ఉంటుందని ముదిరాజ్‌సంఘం ఆల్‌ ఇండియా ప్రధానకార్యదర్శి రోటం భూపతి అన్నారు. పెద్దేముల్‌ మండలం కందనెల్లి సమీపంలోని జీపీఆర్‌ గార్డెన్‌లో ఆదివారం ముదిరాజ్‌ సంఘం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్‌ కులానికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయిస్తున్నట్లుగానే ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్‌లకు 20సీట్లు కేటాయించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70లక్షల జనాభా ఉన్న ముదిరాజ్‌లను పలుపార్టీలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. ముదిరాజ్‌లను డీ నుంచి ఏ గ్రూపులోకి మార్చాలని డిమాండ్‌ చేశారు. ముదిరాజ్‌ల హక్కుల సాధనకు పోరాటం చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నరేష్‌, శ్రీనివాస్‌, యువజన విభాగం జిల్లా అద్యక్షుడు లొంక నర్సింహులు, సంఘం పెద్దేముల్‌ మండల అధ్యక్షుడు, గాజీపూర్‌ సర్పంచ్‌ వీరప్ప, బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, నాయకులు చొప్పరి శంకర్‌, హన్మంతు, ఉత్తమ్‌చంద్‌, సంఘం తాండూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్పీ.రవికుమార్‌, చంద్రశేఖర్‌, జర్నప్ప, అంబరీష్‌, ఎస్పీ.రవికుమార్‌ పాల్గొన్నారు.

ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా హన్మంత్‌

పరిగి: ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పరిగికి చెందిన కావలి హన్మంత్‌ ముదిరాజ్‌ నియమితులయ్యారు. పెదేముల్‌ మండలం కందనెల్లిలో ఆదివారం నిర్వహించిన ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జగన్మోహన్‌ చేతుల మీదుగా నియామకం పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంతో కులస్తులకు సేవచేసేందుకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ముదిరాజ్‌ల అభివృద్ధి కోసం పని చేస్తానని తెలిపారు.

Updated Date - 2023-07-02T23:52:57+05:30 IST