మోదీ నియంతృత్వానికి పరాకాష్ట

ABN , First Publish Date - 2023-03-25T22:55:01+05:30 IST

కాంగ్రెస్‌ ఆగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయడం ప్రధాని మోదీ నియంతృత్వ పాలనకు పరాకాష్ట అని పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు.

 మోదీ నియంతృత్వానికి పరాకాష్ట
విలేకరులతో మాట్లాడుతున్న రామ్మోహన్‌రెడ్డి

అదానీ కోసం దేశ ప్రయోజనాలకు తాకట్టుపెట్టినమోదీ

డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి

పరిగి,మార్చి 25: కాంగ్రెస్‌ ఆగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయడం ప్రధాని మోదీ నియంతృత్వ పాలనకు పరాకాష్ట అని పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. శనివారం పరిగిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. దేశస్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను ఇచ్చిన కుటుంబం రాహుల్‌గాంధీ కుటుంబమని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక పాలనపై, రాహుల్‌ పోరాటంతో నల్లచట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. ఆదానీ, మోదీ బంధం గురించి రాహుల్‌గాంధీ కన్యకుమారి నుంచి కశ్మీర్‌ వరకు చేసిన భారత్‌ జోడోయాత్ర పాటు పార్లమెంట్‌లో ప్రశ్నించినందుకే రాహుల్‌పై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఒక్కరోజులోనే రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడం వెనుక కుట్ర ఉందని విమర్శించారు. భవిష్యత్‌లో కాంగ్రెస్‌ పార్టీ తీసుకునే నిర్ణయాలను బట్టి బీజేపీ ప్రభుత్వంపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు చేస్తామని తెలిపారు.. 2013లో మోదీ సీఎంగా ఉన్న సమయంలో ఆయన మంత్రి బాబు భోకరియాకు అక్రమ మైనింగ్‌ కేసులో మూడేళ్ళ జైలు శిక్షపడితే తప్పించిన మోదీ, ఇప్పుడు రాహుల్‌పై ఆగమేఘాలపై చర్యలు తీసుకోవడం మోదీ పతనానికి నాందియని పేర్కొన్నారు. విపక్షాలన్ని ఏకమై బీజేపీపై పోరాటం చేస్తామని తెలిపారు. సమావేశంలో డీసీసీ ప్రధానకార్యదర్శి కె.హన్మంత్‌ముదిరాజ్‌, పరిగి,కులకచర్ల మండలాల పార్టీ అధ్యక్షులు బీ.పరుశురాంరెడ్డి,బీఎస్‌ అంజనేయులు, పరిగి పట్టణ అధ్యక్షుడు ఇ.కృష్ణ, మత్స్యశాఖ రాష్ట్ర కార్యదర్శి అంజనేయులు, బీసీసెల్‌ అధ్యక్షుడు నర్సింహులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం

పూడూరు: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై సస్పెన్షన్‌ చేయడం సరైంది కాదని యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శనివారం మన్నెగూడలో హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేసి చన్‌గోముల్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ధర్నాలో ఎన్‌ఎ్‌సయూ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు సతీశ్‌రెడ్డి, పరిగి యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాగవర్ధన్‌, పూడూరు మండల అధ్యక్షుడు మోయిన్‌, వీరేశ్‌, రామస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T22:55:01+05:30 IST