చేవెళ్ల డివిజన్‌లో మోస్తరు వర్షం
ABN , First Publish Date - 2023-03-18T23:59:51+05:30 IST
చేవెళ్ల డివిజన్ పరిధి చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాల్లో శుక్రవారం అర్ధరాత్రి వనగళ్ల వాన కురిసింది.

కొన్ని గ్రామాల్లో అర్ధరాత్రి వడగళ్ల వాన
చేవెళ్ల/షాబాద్/శంకర్‌పల్లి, మార్చి 18: చేవెళ్ల డివిజన్ పరిధి చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాల్లో శుక్రవారం అర్ధరాత్రి వనగళ్ల వాన కురిసింది. చేవెళ్ల మండలం ఆలూర్, దేవుని ఎర్రవల్లి, కౌకుంట్ల, తలారం, చేవెళ్లల్లో వడగళ్లు పడ్డాయి. ఈదురు గాలులు, వర్షంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దేవుని ఎర్రవల్లిలో నర్సరీలో మొక్కలకు వేసిన పాలీనెట్‌పై కుప్పులుగా పేరుకున్న వడగళ్లను రైతు మల్లేశ్ శనివారం ఉదయం ఎత్తిపోశాడు. అయితే మండలంలో కొన్నిచోట్ల వడగళ్లు కురిసినా పంటనష్టం జరగలేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. షాబాద్ మండలంలో శనివారం మోస్తరు వర్షం కురిసింది. శంకర్‌పల్లి మండలంలో ఉరుములు, మెరుపులతో జల్లులు కురిశాయి.