రోహిత్‌రెడ్డికే ఎమ్మెల్యే టికెట్‌

ABN , First Publish Date - 2023-08-22T00:01:52+05:30 IST

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్‌ఎ్‌సలో చేరిన రోహిత్‌రెడ్డికి బిఆర్‌ఎస్‌ పార్టీ తిరిగి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కల్పించింది.

రోహిత్‌రెడ్డికే ఎమ్మెల్యే టికెట్‌

  • ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి

తాండూరు, ఆగస్టు 21: గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్‌ఎ్‌సలో చేరిన రోహిత్‌రెడ్డికి బిఆర్‌ఎస్‌ పార్టీ తిరిగి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కల్పించింది. పార్టీలో చేరే ముందే టికెట్‌ హామీ, మొయినాబాద్‌ ఫాం హౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీని ఇరికించడం వంటి వాటితో రోహిత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు దగ్గరయ్యారు. మాజీమంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ప్రాధాన్యత తగ్గడం, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి అటు పార్టీలో, ఇటు అధికారికంగా ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ‘టికెట్‌ రోహిత్‌రెడ్డికే?’ అనే శీర్షికన ఈనెల 13న ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. ముందే చెప్పినట్లుగానే రోహిత్‌రెడ్డికి టికెట్‌ ఖరారు అయింది.

ఒకే కారులో సీఎంతో ప్రగతిభవన్‌కు..

ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పార్టీ కార్యాలయం, తెలంగాణ భవన్‌ నుంచిప్రగతి భవన్‌కు సీఎం కేసీఆర్‌ కారులోనే వెళ్లారు. రోహిత్‌రెడ్డి పేరు ఖరారు చేస్తున్న సమయంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కూడా అక్కడే ఉండి సహకరించారు.

Updated Date - 2023-08-22T00:01:52+05:30 IST