Share News

సీఎం రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:29 AM

సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డిని బుధవారం సాయంత్రం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. పీసీసీ అధికార ప్రతినిథి ఠాగూర్‌ బాలాజీసింగ్‌తో సచివాలయంలో రేవంత్‌ను కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. కల్వకుర్తి ప్రాంతానికి చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాఽధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన్ను అభినందించారు.

సీఎం రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీసింగ్‌

ఆమనగల్లు, డిసెంబరు 27 : సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డిని బుధవారం సాయంత్రం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. పీసీసీ అధికార ప్రతినిథి ఠాగూర్‌ బాలాజీసింగ్‌తో సచివాలయంలో రేవంత్‌ను కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. కల్వకుర్తి ప్రాంతానికి చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాఽధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన్ను అభినందించారు. నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, పలు పెండింగ్‌ పనుల పూర్తికి సహకరించాలని సీఎంను కోరగా సానుకూలంగా స్పందించినట్లు నారాయణరెడ్డి తెలిపారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించాలని సీఎం ను కోరినట్లు బాలాజీసింగ్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:29 AM