ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ది అవకాశవాద రాజకీయం

ABN , First Publish Date - 2023-09-20T00:42:53+05:30 IST

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పూర్తిగా విఫలమయ్యారని, ఆయనది అవకాశవాద రాజకీయమని ఎన్‌బీసీ మాజీ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర నాయకుడు తల్లోజు ఆచారి ఆరోపించారు. క

ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ది అవకాశవాద రాజకీయం

ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి

ఆమనగల్లు, సెప్టెంబరు 19 : అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పూర్తిగా విఫలమయ్యారని, ఆయనది అవకాశవాద రాజకీయమని ఎన్‌బీసీ మాజీ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర నాయకుడు తల్లోజు ఆచారి ఆరోపించారు. కల్వకుర్తి అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు జైపాల్‌ యాదవ్‌ సిద్ధమా? అని ప్రశ్నించారు. ఆమనగల్లు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచారి మాట్లాడుతూ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ తన అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విష ప్రచారాలకు ఒడిగట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్యే సాధించిందేమిటి? తాము అడ్డుకున్నదేమిటని ఆచారి ఎద్దేవా చేశారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినా అభివృద్ధి విషయంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. అధికార పార్టీ, ఎమ్మెల్యే వైఫల్యాలు ప్రశ్నిస్తున్న, ఎండగడుతున్న వారిపై పోలీసులచే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతాల పథకం డీ-82 కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఐదేళ్లుగా పరిహారం చెల్లించకపోవడంతో వారు గోస తీస్తున్న ప్రభుత్వంలో చలనం లేదని ఆచారి అన్నారు.

Updated Date - 2023-09-20T00:42:53+05:30 IST