రామలింగేశ్వరుడి సేవలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్
ABN , First Publish Date - 2023-02-18T00:21:24+05:30 IST
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామిని శుక్రవారం మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వారు స్వామివారికి శ్రీ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు.
కీసర, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి) : కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామిని శుక్రవారం మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వారు స్వామివారికి శ్రీ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈమేరకు సంతోష్ కుమార్ ఎంపీ నిధులతో కీసర పెద్దమ్మ చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఎకో పార్కులో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కను నాటి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తటాకం రమేష్ శర్మ, ఈవో సుధాకర్‌రెడ్డి జడ్పీ వైస్‌చైర్మన్ పూస వెంకటేష్, ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మినారాయణ, సర్పంచ్ నాయకపు మాధురీ వెంకటేష్, ప్రభాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ తటాకం లక్ష్మణ్ శర్మ, వైస్‌ఎంపీపీ సత్తిరెడ్డి, ఎంపీటీసీ నారాయణశర్మ, జలాల్‌పురం సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.