‘మైనింగ్‌ అనుమతులు రద్దు చేయాలి’

ABN , First Publish Date - 2023-03-30T23:49:11+05:30 IST

మున్సిపాలిటీ పరిధిలోని సాకిబండ తండా సమీపంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, మున్సిపాలిటీకి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ప్రోద్బలంతో ఏర్పాటు చేసిన మైనింగ్‌ అనుమతులను రద్దు చేసి పనులను నిలిపివేయాలని ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు.

‘మైనింగ్‌ అనుమతులు రద్దు చేయాలి’

ఆమనగల్లు, మార్చి 30 : మున్సిపాలిటీ పరిధిలోని సాకిబండ తండా సమీపంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, మున్సిపాలిటీకి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ప్రోద్బలంతో ఏర్పాటు చేసిన మైనింగ్‌ అనుమతులను రద్దు చేసి పనులను నిలిపివేయాలని ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. లేనియెడల ఏప్రిల్‌ 3న ఆమనగల్లుకు వస్తున్న మంత్రి కేటీఆర్‌ పర్యటనను బీజేపీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని తెలిపారు. పచ్చటి పంట పొలాల మధ్య ఏర్పాటుచేసిన మైనింగ్‌ మూలంగా గిరిజనులు, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లుతోందని అన్నారు. ఆమనగల్లు పట్టణంలో గురువారం మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌ చైర్మన్‌ దుర్గయ్యలతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆచారి మాట్లాడుతూ అక్రమంగా ఏర్పాటు చేసిన మైనింగ్‌ పనులను వెంటనే నిలిపివేయకపోతే కేటీఆర్‌ పర్యటనను అడ్డుకోవడంతో పాటు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. బీజేపీ నియోజకవర్గ కో-కన్వీనర్‌ నర్సింహ, మాజీ ఎంపీపీ లలితా వెంకటయ్య, కౌన్సిలర్లు లక్ష్మణ్‌, చెన్నకేశవులు, విక్రమ్‌రెడ్డి, శ్రీధర్‌, పాషా, నాయకులు తదితరులున్నారు.

Updated Date - 2023-03-30T23:49:11+05:30 IST