క్రీడలతో మానసికోల్లాసం : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-03-05T00:11:31+05:30 IST

క్రీడలతో శారీరక ధారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం : ఎమ్మెల్యే
కబడ్డీ పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే యాదయ్య

శంకర్‌పల్లి, మార్చి 4 : క్రీడలతో శారీరక ధారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. శనివారం శంకర్‌పల్లి మండలం టంగటూర్‌ గ్రామంలో కబడ్డీ పోటీలను ప్రారంభించారు. అదేవిధంగా శంకర్‌పల్లి మున్సిపాలిటీ రామంతాపూర్‌ వార్డులో ఊరడమ్మ జాతర మహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీ ప్రవీణ్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ పాపారావు, పీఎసీఎస్‌ చైర్మన్‌ శశిధర్‌రెడ్డి, నాయకులు గోపాల్‌, వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్‌ అశోక్‌, చంద్రమౌళి, పాండురంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:11:31+05:30 IST