శాంతియుతంగా ఎన్నికల నిర్వాహణకు చర్యలు

ABN , First Publish Date - 2023-08-22T00:09:41+05:30 IST

త్వరలో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి, కొడంగల్‌ సీఐ ఏ.రాములు కోరారు.

శాంతియుతంగా ఎన్నికల నిర్వాహణకు చర్యలు
కొడంగల్‌లో ర్యాపిడ్‌ యాక్షన్‌ కవాతు నిర్వహిస్తున్న డీఎస్పీ, సీఐ, సిబ్బంది

కొడంగల్‌, ఆగస్టు 21: త్వరలో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి, కొడంగల్‌ సీఐ ఏ.రాములు కోరారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం కొడంగల్‌లో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌తో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో ఫాల్కన్‌ వాహనంతో కవాతు నిర్వహించారు. అనంతరం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో డీఎస్పీ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా పటిష్ట పోలీసు బందోబస్తుతో పాటు సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ఇందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు పోలీసులకు సహకారం అందించాలన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎప్పటికప్పుడు పోలీసుల నిఘాతో అవాంఛనీయ సంఘటనలకు దారి తీస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కవాతులో నియోజకవర్గ పరిధిలోని కొడంగల్‌, బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌ స్టేషన్‌ల ఎస్సైలు, పరిగి డివిజన్‌ పరిధిలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:09:41+05:30 IST