వివాహిత అదృశ్యం

ABN , First Publish Date - 2023-01-25T00:30:30+05:30 IST

వివాహిత అదృశ్యమైన ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని తుర్కయాంజాల్‌లో మంగళవారం చోటు చేసుకుంది.

 వివాహిత అదృశ్యం

ఆదిభట్ల, జనవరి 24: వివాహిత అదృశ్యమైన ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని తుర్కయాంజాల్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ క్రిష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కేతపల్లికి చెందిన బిజ్జల రవికుమార్‌ భార్య ప్రవళికతో కలిసి తుర్కయాంజల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఏవీ నగర్‌లో నివాసముంటున్నాడు. ఇద్దరూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. భార్య ప్రవళిక 20రోజులుగా ఎక్కువగా ఫోన్‌ మాట్లాడుతుండటంతో రవికుమార్‌ మందలించాడు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు డ్యూటీకి వెళ్లి సాయంత్రం 4గంటలకు తిరిగి వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉండగా భార్య ప్రవళిక కనిపించలేదు. బంఽధువులు, స్నేహితులను ఆరా తీసినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో రవికుమార్‌ మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

శంషాబాద్‌లో వృద్ధుడు..

శంషాబాద్‌రూరల్‌: వృద్ధుడు అదృశ్యమైన ఘటన శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగోల్కొండకు చెందిన దూడల సాయిల్‌గౌడ్‌(56) ఈ నెల 23వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు వారి బంధువులు, స్నేహితులను ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో వారు మంగళవారం శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-01-25T00:30:30+05:30 IST